Bank Holidays:  ఈ నెలలో దాదాపు సగం రోజలు బ్యాంకు సెలవులే?

కొత్త సంవత్సరంలో జనవరి నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. జనవరి 1వ తేదీ నుంచి చూసుకుంటే.. రెండవ, నాల్గవ శనివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఆదివారాలు ఇలా అన్ని కలుపుకుంటే మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 

New Update
holiday

Bank holidays

కొత్త ఏడాది మొదలైంది. దీంతో బ్యాంకు ఉద్యోగులు అందరూ ఈ ఏడాదిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయని, ఏ పండుగ ఎప్పుడు రాబోతుందని చూస్తుంటారు. ముఖ్యంగా జనవరి నెలలో ఎన్ని సెలవులు ఉంటాయని చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ నెలలో పండుగలు, రిపబ్లిక్ డే ఉన్నాయి. దాదాపుగా ఈ నెలలో సగం రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎందుకంటే జనవరి 1వ తేదీ నుంచి చూసుకుంటే.. రెండవ, నాల్గవ శనివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఆదివారాలు ఇలా అన్ని కలుపుకుంటే 14 రోజులు సెలవులు రానున్నాయి. 

ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

ఏయే రోజులు సెలవులంటే?

జనవరి 1వ తేదీ బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి 6 వ తేదీ సోమవారం: గురుగోవింద్ సింగ్ జయంతి - హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి 11వ తేదీ శనివారం: మిషనరీ డే - మిజోరం
జనవరి 11వ తేదీ శనివారం: రెండవ శనివారం - దేశవ్యాప్తంగా
జనవరి 12వ తేదీ ఆదివారం: స్వామి వివేకానంద జయంతి - పశ్చిమ బెంగాల్
జనవరి 13 వ తేదీ సోమవారం: లోహ్రీ - పంజాబ్, ఇతర రాష్ట్రాలు
జనవరి 14వ తేదీ మంగళవారం: సంక్రాంతి - అనేక రాష్ట్రాలు

ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

జనవరి 14వ తేదీ మంగళవారం: పొంగల్ - తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
జనవరి 15వ తేదీ బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం - తమిళనాడు
జనవరి 15వ తేదీ బుధవారం: తుసు పూజ - పశ్చిమ బెంగాల్, అస్సాం
జనవరి 23వ తేదీ గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి - అనేక రాష్ట్రాలు
జనవరి 24వ తేదీ శనివారం: నాల్గవ శనివారం -  దేశం అంతటా
జనవరి 26వ తేదీ ఆదివారం: గణతంత్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి 30వ తేదీ గురువారం: సోనమ్ లోసర్ - సిక్కిం

ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు