ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ విషయం మీద ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది బాధాకర ఘటన అని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వివరించారు. Also Read : ప్రముఖ నటుడు గురుచరణ్ పరిస్థితి దారుణం ప్రగాఢ సానుభూతి.. తిరుపతి (Tirupati) లో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు తీవ్రంగా కలచివేసింది: తెలంగాణ సీఎం తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ వద్ద జరిగిన దారుణ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు.ఈ వార్త తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎక్స్ వేదికగా అన్నారు. వారి మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. Also Read: Pawan: తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు దిగ్భ్రాంతికరం: కిషన్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతినితెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Also Read : బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! బండి సంజయ్ దిగ్భ్రాంతి తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. Also Read: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్