Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు వ్యయప్రయాసలు కూర్చి దేశ,విదేశాల నుంచి వస్తుంటారు. కానీ స్వామి వారి దర్శనం, వసతి గదుల విషయం లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇక రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు దర్శనం కోసం 24 గంటల నుంచి 48 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ మేరకు సామాన్య భక్తులకు దర్శనం మరింత త్వరగా పూర్తయ్యేందుకు టీటీడీ కీలక అడుగులు ముందుకు వేస్తుంది. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శన టోకెన్ పొందడం, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ప్రవేశించేందుకు "ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ" విధానాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు తిరుమలలో డెమో కూడా పూర్తయినట్లు ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. తిరుమలలో ఓ సంస్థ డెమో ఇచ్చింది. Also Read: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్! 'భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభంగా, వేగంగా అందించాలనే టీటీడీ చైర్మన్ గొప్ప సంకల్పానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలు, రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులకు 2 నుండి 3 గంటల వ్యవధిలోనే దర్శనభాగ్యం కల్పించాలని గత నెలలో జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో తీర్మానించారు. Also Read: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులైన పలు సంస్థలు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలుస్తున్నారని చెప్పారు. 'ఈ క్రమంలో AI Powered Facial Recognized Q-Management Systemలో అనుభవం గల.. Aaseya and Ctruh రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సిస్టమ్‌తో టీటీడీ చైర్మన్ దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సదరు సంస్థ ప్రతినిధులు రూపొందించిన కాన్సెప్ట్‌ను పాలకమండలి ఛైర్మన్, సభ్యులకు సంస్థ ప్రతినిధులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. Also Read: ఇక అల్లు అర్జున్‌ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! ఫేస్ రిగక్నైజేషన్ రికార్డ్‌తో పాటు కియోస్కి మిషన్ స్లిప్ జనరేట్ చేస్తుంది.. ఆ స్లిప్‌లో కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం డెమో ఇచ్చిన రెండు కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నారు.వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో, ఆచరణ యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నారు'అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.