జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్టేనని ప్రజలు భావించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ ఓటమిపాలై ఏడాది కాలేదని.. అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందన్నారు. గత ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారని ఆరోపించారు. ప్రజలు జగన్ పాలన చూసి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. అయినా 30 సంవత్సరాలు నేనే సీఎం అని భ్రమలో ఉన్నాడని ఫైర్ అయ్యారు.
జగన్ ను మానసిక వైద్య నిపుణులకు చూపించాలని భారతిని కోరుతున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతమని స్పష్టం చేశారు. జగన్ మాటలకు వైసీపీ నేతలే విస్తుపోతున్నారన్నారు. అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ కు గౌరవాన్ని ఇవ్వలేదన్నారు. జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పా ఎవరూ సంతోషంగా లేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి అయినా కబ్జాకు గురైందా..? అని ప్రశ్నించారు.
2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు..
జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలేనని ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో అసెంబ్లీ లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారని.. వైసీపీ వారిలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరన్నారు. జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావన్నారు.
Buddha Venkanna: జగన్ ఓ పశుపతి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్!
జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్లేనని ప్రజలు భావించారన్నారు. జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
Budda Venkanna YS Jagan