Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్‌..రెండు నెలలు ఆ రైలు రద్దు!

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

కుంభమేళాకు అంతా రెడీ అవుతుంది.కోట్లాది మంది  పాల్గొనే ఈ మహా వేడుకకు అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారనే సంగతి తెలిసిందే. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక చర్యలు మొదలు పెట్టింది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ.. కుంభమేళాలో పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: Manmohan Singh: హార్ట్ సర్జరీ అయ్యాక మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఇవే..

Trains Cancelled Effect Of Kumbhamela

తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు సర్వీసును సుమారు రెండు నెలల పాటు రద్దు చేసింది. తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు, హుబ్లీ - తిరుపతి ప్యాసింజర్ రైలును సౌత్‌ సెంట్రల్ రైల్వే  రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.కుంభమేళా సందర్భంగా రెండు నెలల పాటు తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ప్రకటించారు.

Also Read: China: చైనా బిగ్‌ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు

తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రైలు. కుంభమేళా కారణంగా రెండు నెలల పాటు ఈ రైలును రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తిరుపతి హుబ్లీ ప్యాసింజర్ రైలుకు 22 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు వల్ల రోజుకు  రూ.3.5 లక్షల ఆదాయం వస్తుంది. తిరుపతి హుబ్లీ మధ్య 62 రైల్వేస్టేషన్లలో దీనికి స్టాప్‌ ఉంది. తిరుపతి నుంచి ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల మీదుగా కర్ణాటక చేరుతుంది.

Also Read: Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్!

ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల మీద నుంచి వెళ్తుండటంతో గ్రామీణ ప్రజల నుంచి ఈ రైలుకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ రైలును రెండు నెలల పాటు రద్దు చేయడంతో ఆ ప్రాంతవాసులు ప్రత్యామ్నాయ రైలును నడపాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Also Read: స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు!

మరోవైపు తిరుపతి - కదిరిదేవరపల్లి రైలును, గుంతకల్లు - తిరుపతి రైలును కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. డిసెంబర్ 28 నుంచి ఈ రైలు సర్వీసులను ఈ రూట్‌ లో రద్దు చేసి.. కుంభమేళాకు పంపనున్నారు. రెండు నెలల తర్వాతే ఈ రైలు సర్వీసులు తిరిగి అందుబాటులోకి వస్తాయి.

అయితే కుంభమేళాకు లక్షల మంది జనం వస్తుంటారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆరు రైళ్లను కుంభమేళాకు పంపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు