Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. 

New Update
pandem kollu

Pandem kollu betting

Pandem kollu: సంక్రాంతి పండుగకు మరో వారం ఉండగానే ఏపీలో పందెం కోళ్ల హంగామా నడుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండానే పందెం రాయుళ్లు కాలుదువ్వుతున్నారు. పెద్దగా హంగామా చేయకుండా రాత్రి వేళల్లో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నారు.

చీకటి పడగానే 7 గంటలకు పందెం మొదలుపెట్టి లైట్ల వెలుతురులోనూ తెల్లారేలోపు కంప్లీట్ చేస్తున్నారు. ఉండి, భీమవరం ప్రాంతాల్లో ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో పందేలు వేస్తున్నారు. బరిలోకి దిగేవారికి సీక్రెట్ గా సమాచారం ఇచ్చి ఐడీ కార్డులను పంచుతున్నారు. అంతేకాదు ఇక వీరి పందేలను ఫొటో, వీడియో తీయకుండా ముందు జాగ్రత్తలు తీసకుంటున్నారు. 

రూ.2 నుంచి రూ.3 లక్షల చొప్పున..

ఇక ఒక్కో పందెం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున నడుస్తున్నాయట. కొన్నిసార్లు రూ.50 లక్షలకు వరకూ బెట్టింగులు పెడుతున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని తదితర మండలాల్లో కోళ్లను కొనుగోలు చేసి రంగంలోకి దిగుతున్నారట. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు గోదావరి జిల్లాకు తరలివెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Dogs: అయ్యో పాపం.. కాళ్లు,నోళ్లు కట్టేసి 32కుక్కలను చంపిన గ్రామస్థులు!

ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజి డీఐజీ అశోక్‌కుమార్‌ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు గుట్టు చప్పుడు కాకుండా కాసులు దండుకోవడం సంచలనం రేపుతోంది. 

ఇది కూడా చదవండి: NagaVamsi : ఊర్వశిని కొట్టింది నేను కాదు బాలయ్య.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు