ఏపీలోని విజయవాడలో భారీ ల్యాండ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా రూ.700 కోట్ల భూ స్కామ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఇటీవల ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి హస్తం ఉన్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ధర్మ సింగ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందించారు. సబ్ రిజిస్ట్రార్‌గా ఉంటూ.. ధర్మ సింగ్ ఎక్కువగా లంచాలు తీసుకునే వారని శ్రీకాంత్ తెలిపారు. ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆ లేఖలో ఏం ఉందంటే? 700 కోట్లు విలువ చేసే ల్యాండ్‌ను ఏపీ మాజీ సీఎం అనుచరులు కొట్టేశారని ధర్మ సింగ్ ఆరోపించారు. చీమకుర్తి శ్రీకాంత్, అతని భార్య రీతూ చౌదరి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో తెలిపారు. చీమకుర్తి శ్రీకాంత్ రెండవ భార్య అయిన రీతూ చౌదరి అసల పేరు వనం దివ్య. వీరు వివాహం చేసుకున్నారని గత కొంత కాలం నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా ఉండటంతో ఈ స్కామ్‌లో ఆమె హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా రీతూ చౌదరి స్పందించలేదు. ఇది కూడా చూడండి: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. రీతూ చౌదరి యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, ప్రోగ్రామ్స్‌లో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. తన హాట్ అందాలతో అద్దులు మీరి ఫొటోలు అప్లోడ్ చేస్తూ.. ప్రేక్షకుల నుంచి విమర్శకులు కూడా అందుకుంది. తాజాగా ఈ కేసులో ఇరుక్కుంది. మరి ఈ కేసులో ఈమె హస్తం ఉందా? లేదా? అనే పూర్తి వివరాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..