Nalgonda: మీరు సూపర్ సార్.. ఉదయం 5 గంటలకే.. టెన్త్ స్టూడెంట్ ఇంటికెళ్లి యాదాద్రి కలెక్టర్ ఏం చేశాడంటే!?

పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్‌ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు.

New Update
collector

collector

పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు '' విద్యార్థుల ఇంటి తలుపు తట్టే'' కార్యక్రమాన్ని సంస్థాన్‌ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో  ప్రారంభించారు.గురువారం తెల్లవారుజామున 5 గంటలకే మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న పల్లెటూరు చేరుకున్నారు.

Also Read: Horoscope Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!

కలెక్టర్‌ ని అని...

విద్యాస్థాయిలో సీ గ్రేడ్‌ లో ఉన్న దేవరకొండ భరత్‌ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లారు. అతని ఇంటి తలుపు తట్టారు. తాను కలెక్టర్‌ ని అని పరిచయం చేసుకొని విద్యార్థితో ,అతని తల్లితో మాట్లాడారు.50 రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే పదో తరగతిలో ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉందని వివరిచారు.

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

విద్యార్థి పోషకాహార లోపంతో బలహీనంగా ఉండడాన్ని గుర్తించి అతని పోషణ కోసం నెలకు 5000 రూపాయలు చొప్పున తన సొంత డబ్బులు అందిస్తానని ప్రకటించి అప్పటికప్పుడే డబ్బులు అందజేశారు.విద్యార్థి చదువుకునేందుకు స్టడీ చైర్‌ తో పాటు పుస్తకాలు, ప్లాంకు, పెన్నులు బహుమతిగా అందజేశారు. 

పంచాయతీ కార్యదర్శి సుభాష్‌ కు విద్యార్థి చదువును,అతని అవసరాలను పర్యవేక్షించాలని బాధ్యత అప్పగించారు.

ఇదిలా ఉంటే నారాయణపూర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస చేశారు. వచ్చి రాగానే పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు అని వారితో ముచ్చటించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్‌లు అందజేశారు. అలాగే విద్యార్థుల వసతులను కూడా పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని సూచించారు.అంతేకాకుండా రాత్రి వారితో కలిసే నిద్ర పోయారు.

Also Read: Trump Effect: ట్రంప్‌ ఆఫర్‌ ఎఫెక్ట్‌.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

Also Read: Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు