/rtv/media/media_files/2025/03/14/6PBDMDjodwXsxbZ3Djvg.jpg)
Holi celebration
Holi celebration : హోలీ పండుగ అనగానే రంగులు చల్లుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఆ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో కొట్టుకుని ఆడుతారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. గ్రామంలో వింత ఆచారంలో భాగంగా హోలీ నాడు పిడి గుద్ధులతో ఫైటింగ్ చేశారు. ప్రతి సంవత్సరం లాగే తమ వింత ఆచారాన్ని కొనసాగిస్తూ నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో పిడిగుద్దులాట కొనసాగింది. గ్రామ కూడళ్లలో చేరి ముష్టి ఘాతాలతో రెచ్చిపోయారు. ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పిడిగుద్దులాట ఈ సంవత్సరం కూడా హోలీ రోజు సాయంత్రం యథావిధిగా కొనసాగింది. ప్రజలు ఉదయం హోలీ ఆడిన తరువాత సాయంత్రం హనుమాన్ ఆలయం ఎదురుగా ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.తాడుకు ఇరువైపులా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా దాడులు చేసుకున్నారు.
Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
రక్తం వచ్చిన చోట కాముని బూడిదతో తుడుచుకున్నారు. ఆట ముగియగానే పరసర్పం ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ ఆటను ఉద్దేశించి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కనీసం అయిదు నిమిషాలపాటు అయినా ఈ ఆట ఆడాలని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ రోజున కొనసాగే ఈ క్రీడ నిర్వహించకపోతే చెడు జరుగుతుందని గ్రామస్థుల నమ్మకంతో ఈ ఆచారం కొనసాగుతోందని అక్కడ వారు బలంగా నమ్ముతున్నారు. అంతకుముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం పిడిగుద్దులాటను కొనసాగించి గ్రామంలో ఎప్పటినుంచో వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగించారు. ఈ పిడిగుద్దులాట ఆడకపోతే గ్రామానికి అరిష్టమని, ఒక సంవత్సరం ఆడకపోతే గ్రామంలో ట్యాంకు కూలిందని, నష్టం జరిగిందని.. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ క్రీడను కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది తమ విశ్వాసమని, ఈ ఆటలో దెబ్బలు తగిలినా అవి త్వరగానే మానిపోతాయని చెబుతున్నారు.
Also read; JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్
పోలీస్ ఆంక్షలు కాదని..
నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ ఆంక్షలను కూడా కదాని గ్రామస్తులు తమ ఆచారాన్ని కొనసాగించారు. అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వచ్చారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగింది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై
Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
Also Read: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్!
Also Read: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా?