హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల

హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ కోసం రేవంత్ సర్కార్ భారీగా నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ మొత్తం రూ.5,942 కోట్ల నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే టెండర్లకు పిలిచి పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
FLYOVER

హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ కోసం గ్రేటర్ హైదరాబాద్‌  మున్సిపల్ కార్పొరేషన్‌లో హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నొవేటివ్ అంట్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) (H-CITI) ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా  చేపట్టనున్న పనులు కోసం రేవంత్ సర్కార్ భారీగా నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ మొత్తం రూ.5,942 కోట్ల నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే టెండర్లకు పిలిచి ఈ నిధులతో రహదారి విస్తరణ పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.   

Also Read: శిల్పారామం 106 స్టాల్స్‌‌లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం

ఇదిలాఉండగా.. మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్‌ సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే GHMCలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ జోన్‌లో ఏవోసీ సెంటర్‌ చుట్టూ రహదారులు నిర్మించేందుకు అత్యధికంగా రూ.940 కోట్ల విడుదలకు పర్మిషన్లు ఇచ్చింది.  

ఇక శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ, విప్రో జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.837 కోట్లు మంజూరు చేసింది. మియాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్, లింగపల్లి నుంచి గచ్చిబౌలి వైపునకు మూడు వరసలతో అండర్ పాస్ నిర్మాణం కోసం రూ.530 కోట్లు కేటాయించింది.  

Also Read: డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు

మరోవైపు LB నగర్‌ జోన్‌లో టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ కోసం రూ.416 కోట్లు విడుదల చేసింది. అలాగే ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ కోసం రూ.398 కోట్లు మంజూరు చేసింది. దీంతో త్వరలోనే రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు