Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Telangana Budget

Telangana Budget

తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెంపు.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రధాన అంశాలుగా అంచనాలు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది. గతేడాది 2024–25లో రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి మరో 40 వేల కోట్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచాల్సి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోనే  ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనుంది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్‌‌‌‌మెంట్ వల్ల శాలరీ బడ్జెట్​ పెరగనుంది. దీనికి ఒకట్రెండు పెండింగ్​ డీఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాలి. పైగా గతేడాదితో పోలిస్తే అప్పుల కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్‌‌‌‌కు అంచనాలు సిద్ధం చేస్తుంది. 

Also Read: డ్యాన్స్ చేయ్ లేదంటే సస్పెండ్ చేస్తా.. పోలీసుకు ఆర్జేడీ నేత వార్నింగ్

ఇక రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంది. ఇందుకోసం 3వేల కోట్ల మేర అంచనాలు రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు ప్రాధాన్యంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకూ.. ఈసారి భారీగా నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. అందులో పాలమూరు–రంగారెడ్డితో పాటు సీతారామ లిప్ట్​ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులకు అంచనాలు రెడీ చేశారు. ఇంటిగ్రేటెడ్ ​స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, కాలేజీల్లోనూ మిడ్​ డే మీల్స్ కల్పించేలా నిధులు ప్రతిపాదిస్తున్నారు. 

Also read: తీరని పగ.. మాజీ ప్రియుడికి విషం తాగించి చచ్చేలా కొట్టిన ప్రియురాలు!

ఈ సారి బడ్జెట్‌‌‌‌లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల డిక్లరేషన్ ​ప్రకారం వచ్చే బడ్జెట్‌‌‌‌లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ.. సీఎం రేవంత్ ​రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటీవల లేఖ రాశారు. అందులో భాగంగానే బడ్జెట్‌‌‌‌లో ఎస్సీలకు 54 వేల కోట్లు కేటాయించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు