TG Govt: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

ఆరోగ్య శ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇది వరకు మూడేళ్ల వయస్సు ఉండగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్‌ వెల్లడించారు.

New Update
 CM Revanth Reddy

CM Revanth Reddy

మారిన జీవనశైలి (Life Style) వల్ల చిన్న పిల్లలు కూడా వినికిడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పిల్లలకు వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఇంతకాలం పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్‌ ఒక సర్క్యులర్‌‌ను కూడా జారీ చేశారు. ఈ సర్జరీ వల్ల వినికిడి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలగకపోవచ్చు. కానీ కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఈ సర్జరీకి ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే సగటున రూ.6 నుంచి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నా రు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే..

ఇప్పటివరకు కోఠీలో ఈఎన్‌టీ, గాంధీ ఆసుపత్రి, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. వీటిలో కూడా 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం ఈ 3 ఆస్పత్రుల్లో 132 సర్జరీలు మాత్రమే చేశారు. అయితే ఇకపై మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ సర్జరీలను చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్స కావడంతో నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భావించి ఇంతకాలం ప్రైవేటు ఈఎన్‌టీ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద ఈ సర్జరీలు చేసే అవకాశమివ్వలేదు. ప్రైవేటు ఈఎన్‌టీ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులుగా నమోదయ్యే వీలు కల్పించేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది విధానపరమైన నిర్ణయం కావడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత అందుకు అనుమతులు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఆరోగ్యశ్రీ (Arogya Sri) కింద ప్రస్తుతం కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి రూ.5.75 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక చెవికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేసేందుకే ఈ ఖర్చు అవుతుందని ఈఎన్‌టీ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి ఒక చెవికి సర్జరీ చేసుకోవచ్చు. ఈఎన్‌టీ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో అవకాశం కల్పించాలి. దాంతో నాణ్యమైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు మరింత అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రైవేటులో నిర్వహించే ఈ సర్జరీలపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే దుర్వినియోగయ్యే అవకాశం ఉండదు. జిల్లాకు ఒక అధికారిని నియమించి, పర్యవేక్షించాలి. వైరల్‌, బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వాటికి కాక్లియర్‌ సర్జరీతో మెరుగైన ఫలితం ఉంటుంది.

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు