TG: చేసిందంతా కేటీఆరే.. దానకిశోర్‌ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు!

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి దానకిశోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.

New Update
e formula race case

e formuala race case

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారిన ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్‌ గా తీసుకోవడంతో ఏసీబీ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది.  ఈ క్రమంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దాన కిశోర్ స్టేట్మెంట్‎ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. దాన కిశోర్‎ను దాదాపు 7 గంటల పాటు సుధీర్ఘంగా విచారించిన అధికారులు ఆయన వాంగూల్మాన్ని రికార్డు చేశారు.

Also Read: TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం

KTR - Dana Kishore

ఈ కేసుకు సంబంధించిన పత్రాలను దాన కిశోర్ దగ్గరి నుండి అధికారులు ఇప్పటికే తీసుకున్నారు. దాన కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‎కు నోటీసులు ఇవ్వడానికి  ఏసీబీ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హూస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: Viajyawada: డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!

అయితే, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆమోదం లేకుండా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‎కు విరుద్ధంగా అప్పటి మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ నోటి మాట మేరకు హెచ్ఎండీఏ కార్ రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా విదేశీ సంస్థకు ప్రభుత్వం డబ్బు ట్రాన్స్‎ఫర్ చేయాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు ట్రాన్స్‎ఫర్ చేసినట్లు తేలడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

ఈ మేరకు ఫార్ములా ఈ కార్ రేస్ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి మంత్రి కేటీఆర్ ఏ1, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‎ను ఏ2 నిందితులుగా చేర్చి విచారణలో దూకుడు పెంచింది. మరోవైపు ఫార్మూలా ఈ కార్ రేసింగ్ వ్యవహరంలో కేటీఆర్ తనపై నమోదైన కేసును హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో 2024, డిసెంబర్ 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.ఈ క్రమంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో కార్ రేసింగ్ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దాని మీద తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.

Also Read: AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు