Psycho Woman: సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..!

హైదరాబాద్‌ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన తల్లీ, సోదరిని హతమార్చినట్లు పోలీసుల విచారణ తేలింది.

New Update
Secunderabad Woman Murdered her Mother and sister with boyfriend

Secunderabad Woman Murdered her Mother and sister with boyfriend

ప్రియుడి మోజులో పడి కొందరు తమ సొంత వారినే కడతేర్చుతున్నారు. తల్లి, చెల్లి.. అన్నా, తమ్ముడు అనే తేడా లేకుండా హతమార్చుతున్నారు. ఇటీవల అలాంటిదే హైదరాబాద్‌ (Hyderabad) లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒక సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, సోదరి మృతి చెందారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ.. చివరికి అసలు నిజం బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని విషయాలను బయటపెట్టారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నారని.. ఓ కూతురే.. తన ప్రియుడితో కలిసి తల్లి, చెల్లిని హతమార్చినట్లు తెలుస్తోంది. 

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ఏం జరిగింది..?

నార్త్ లాలాగూడకు చెందిన వుడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమా మహేశ్వరి ముగ్గురు ఆడపిల్లలు, శివ అనే ఒక మగ బిడ్డ సంతానం. వీరంతా అవివాహితులే. అందులో పెద్ద కూతురు జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా లేదు. ఇక ఉమా మహేశ్వరి లాల్‌బజార్‌లోని ఒక కాల్‌ సెంటర్‌లో జాబ్ చేస్తుంది. కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక వీళ్ల తండ్రి రైల్వే ఉద్యోగి. అతడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద రెండో కుమార్తె లక్ష్మికి ఇచ్చారు.

దీంతో లక్ష్మి లాలాగూడ వర్క్‌ షాప్‌లో ఉద్యోగం అక్కడే రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. ఇక తనతో పాటే తన సోదరి జ్ఞానేశ్వరి ఉంటోంది. అదే సమయంలో యూపీకి చెందిన అరవింద్ కుమార్‌ అనే యువకుడితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. 2010 నుంచే లక్ష్మి, అరవింద్ సన్నిహితంగా మెలగసాగారు. అది లక్ష్మి తల్లి సుశీలకు నచ్చలేదు. దీంతో పలుమార్లు కుటుంబసభ్యులు హెచ్చరించారు. 

కానీ లక్ష్మీ మాత్రం వారి మాటలు పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలో సోదరి జ్ఞానశ్వరే మొత్తం సమాచారాన్ని తల్లికి చెబుతుందని తెలుసుకుంది. దీంతో తన సోదరిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడు అరవింద్‌తో కలిసి ఈ నెల 3వ తేదీన సోదరి జ్ఞానేశ్వరిని హతమార్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక మూటలో కట్టి సిమెంట్ కుండీలో పడేసి ఏం తెలియన్లు ఉండిపోయారు.

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

ఇక ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే అంటే 6వ తేదీన జవహర్‌నగర్‌లోని నివాసముంటున్న సుశీలను సైతం లక్ష్మీ ప్రియుడు అరవింద్ హతమార్చాడు (Murder). రాత్రి 7 గం.ల సమయంలో ఒంటరిగా ఉన్న సుశీల ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు వచ్చి జరిగిన విషయాన్ని మరో కూతురు ఉమా మహేశ్వరికి చెప్పారు. ఆమె సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర రక్తంతో పడి ఉన్న తల్లి చూసి షాక్ అయింది. కానీ సుశీల అప్పటికే మరణించడంతో.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. 

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా చెక్ చేశారు. దాని బట్టి లక్ష్మి ప్రియుడు అరవిందే ఈ అఘాయిత్యానికి పాల్పడి.. గోడదూకి పారిపోయినట్లు గుర్తించారు. అనంతరం తిన్నగా వెళ్లి లక్ష్మిని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. తమ బంధానికి అడ్డువుస్తుందనే కోపంతో సోదరి జ్ఞానేశ్వరిని హతమార్చినట్లు ఆమె ఒప్పుకుంది. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి పోర్టుమార్ట్‌కు పంపించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారిలో ఉన్న అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు