/rtv/media/media_files/2026/03/15/rain-alert-2026-03-15-14-22-41.jpg)
Rain Alert
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(telangana weather report today) చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: చికెన్ ధరలకు రెక్కలు..ఒక కిలో చికెన్ ధర రూ.325
Rain Alert For Telangana
ఆదివారం ప్రధానంగా ఉత్తర, పశ్చిమ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
Also Read: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ..కాల్పుల కలకలం
Follow Us