వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా తాము విజయోత్సవాలు నిర్వహిస్తుంటే విపక్ష పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారంటూ విమర్శలు చేశారు. Also Read: 2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే గత పదేళ్ల పాలనలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై ఎన్నోసార్లు నిరసనలు , ధర్నాలు జరిగాయని అన్నారు. కానీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తోందంటూ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చూపిస్తున్న ద్వంద్వ వైఖరికి ఆశా వర్కర్లు చేసిన నిరసనలే నిదర్శనమని పేర్కొన్నారు. '' 2015లో జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు 106 రోజులు నిరసనలు చేశారు. వాళ్లని ఎవరూ పట్టించుకోలేదు. Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు ఆ తర్వాత కూడా వీళ్లు ఎన్నోసార్లు సమ్మేలు, ధర్నాలు చేపట్టారు. కానీ అప్పటి బీఆర్‌ఎశ్ ప్రభుత్వం వీళ్ల సమస్యల పరిష్కారానికి మొగ్గుచూపలేదు. కానీ ఇప్పుడు ఆశా వర్కర్ల వైపు మాట్లాడుతున్నారు. ఆశా వర్కర్లు సంయమనం పాటించాలి. రాజకీయంగా ప్రేరేపిస్తున్న వాళ్ల ఉచ్చులో పడకండి. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని'' మంత్రి దామోదర రాజనర్సింహ తేల్చిచెప్పారు. Also Read: ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మత నాయకుడికి 50 ఏళ్లు..