మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!

అల్లు అర్జున్ ను థియేటర్ కు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తాపత్రయ పడుతున్నారన్నారు. గురుకుల విద్యార్థుల మృతిపై సీఎం అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదన్నారు.

New Update

తమను అనేక కార్యక్రమాలకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసే పోలీసులు.. అల్లు అర్జున్ ను ఎందుకు ఎందుకు అడ్డుకోలేదని మెదక్‌ ఎంపీ, బీజేపీ కీలక నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు పోలీసులు అభిమానంతోనే, లేక ఉత్సాహంతోనో తొందరపడి ఆ రోజు సంధ్య థియేటర్ గేట్లు తెరిచారన్నారు. తొక్కిసలాట చాలా బాధకరమైన విషయం అన్నారు.

గురుకుల విద్యార్థులకు రూ.25 లక్షలు ఇవ్వాలి..

ఈ ఘటనపై అల్లు అర్జున్ తో పాటు సినీ ఇండస్ట్రీ బాధ్యత వహించాలని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. గురుకులాల్లో  చనిపోయిన 42 మంది విద్యార్థులకు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది సినీ నటుడి గురించి కాదన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Advertisment
Advertisment