BREAKING: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. దసరా నుంచి రైతు భరోసా నగదును అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. దసరా నుంచి రైతు భరోసా నగదును అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.
నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు.ఈ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభా లెక్కించాల్సిందేనని పేర్కొన్నారు.
తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వనపర్తి జిల్లాలోని కొత్తపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ కారణంగా అదుపుతప్పిన కారు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. వర్శిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
తనను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ దగ్గర నుంచి రూ.25 కోట్లు రేవంత్ తీసుకున్నాడన్నారు.