బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... రైతు భరోసాను అమలు చేయని సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అందులో భాగంగానే ఈ ఏసీబీ డ్రామాను నడుపుతున్నారని మండిపడ్దారు. తనను ఏసీబీ ఆఫీసుకు పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. రైడ్స్ చేసి ఏదోకటి అక్కడ పెట్టి దొరికినట్టు చేస్తారన్నారు. ఇక పోలీసులపై తనకు నమ్మకం లేదన్న కేటీఆర్.. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా చూపించారని కేటీఆర్ ఆరోపించారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ కు కేటీఆర్ ఇక ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ లాయర్లను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఒంటరిగానే వెళ్లాలని చెప్పారు. దీంతో పోలీసులతో 40 నిమిషాల పాటు కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. లాయర్లను ఎందుకు లోపలికి అనుమతించడం లేదని ఇందుకు గల ఆదేశాలు చూపించాలంటూ కేటీఆర్ ఆఫీసు సమీపంలోనే వేచి ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి జరిగింది తనకు జరగవద్దనే లాయర్లతో వచ్చానని తెలిపారు. లాయర్లతో వస్తే ఏసీబీ అధికారులకు ఏంటీ ప్రాబ్లమ్ అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. రాతపూర్వకంగా తన స్టేట్ మెంట్ ఏఎస్పీకి ఇచ్చానన్నారు కేటీఆర్. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్‌కు వచ్చానన్న కేటీఆర్.. లాయర్లను అనుమతిస్తే విచారణకు కూడా హాజరు అవుతానని స్పష్టం చేశారు. అనంతరం అక్కడినుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అటు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. Also read : ఇండియాలో తొలి HMPV కేసు