నిన్న పుష్ప–2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్‌లో పడింది. దీనికి అల్లు అర్జున్ వచ్చాడు. ఈ క్రమంలో జనాల మధ్య తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడని ముందుగానే తెలిసినా...తగిన చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇప్పుడు దీని మీదనే కేసు నమోదయ్యింది. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పని కారణంగా...బాద్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ మీద కూడా ఫిర్యాదు చేశారు తెలంగాణ న్యాయవాదులు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు కఠిన చర్యలు ఉంటాయి.. ఈకేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ మాట్లాడారు. సంధ్యా థియేటర్‌లో వేసిన పుష్ప–2 ప్రీమియర్ షో గురించి తమకు సమాచారం ఉన్నా...దీనికి అల్లు అర్జున్, ఇంకా కీలక నటులు వస్తారని మాకు సమాచారం లేదని ఆయన చెప్పారు. థియేటర్ యాజమాన్యం, బన్నీ టీమ్ ఎవరూ తమకు ఇన్ఫామ్ చేయలేదని అన్నారు. దానికి తోడు వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. పైగా అల్లు అర్జున్ వచ్చిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టేశారు. అప్పటికే థియేటర్ లోపల, బయట జనంతో కిక్కిరిసిపోయింది. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి అక్కడే చనిపోగా..శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు Also Read: కార్పొరేటర్ టూ సీఎం.. ఫడ్నవీస్ విజయ ప్రస్థానమిదే! Also Read: PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్