మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) అంటే టక్కున గుర్తొచ్చేది డాన్స్. తాజాగా బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో (Holi Celebrations) తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. డప్పులు కొడుతూ, చిన్నపిల్లలను ఉత్సాపరుస్తూ, డ్యాన్సులు చేస్తూ తన సతీమణికి రంగులు పూసారు మల్లారెడ్డి. ఈ వేడుకల్లో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మల్లారెడ్డినా మాజాకా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Also read : వరంగల్‌లో కిలాడీ లేడీ..బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు
Also read : 14ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. 7 సెకన్లలోనే గుండె గుట్టు చెప్పే యాప్
డాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్న మల్లా రెడ్డి
— Nijam Times (@Nizam_Times) March 14, 2025
బోయిన్పల్లిలో తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులు, అభిమానులతో కలిసి హోలీ సంబరాలలో పాల్గొన్నారు#Mallareddy pic.twitter.com/LJZSZXwHpB
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. రంగులు చల్లకుంటూ శుభాకాంక్షలు చెబుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లో మద్యం షాపులు బంద్ చేశారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు.
Also Read : వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
Also read : అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్