హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలామంది పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డయల్ 100కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగింది. ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఘటనాస్థలానికి వెళ్లే సమయం కూడా బాగా తగ్గింది. ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు రాత్రిపూట కూడా పోలీసుల గస్తీ పెంచాం. ధ్వని కాలుష్యంపై తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తోంది. డిజే సౌండ్‌లపై పలుసార్లు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి 45 శాతం ఎఫ్‌ఐఆర్‌లు పెరిగాయి. పెరిగిన వాటిలో చిన్నచిన్న చోరీలు, యాక్సిడెంట్ కేసులున్నాయి. గతంలో చిన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యేది కాదు. ఇప్పుడు ప్రతీ చిన్న నేరానికి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అందుకే కేసుల సంఖ్య పెరిగింది. ఇక కిడ్నాప్ కేసులు 85 శాతం పెరిగాయి. సెల్‌ఫోన్ల చోరీల సంఖ్య కూడా పెరిగింది. Also Read: అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన! సైబర్ నేరాల వలలో పటి కేటుగాళ్ల చేతిలో డబ్బు పోగొట్టుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా కూడా మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు అనగానే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో కూడా చాలామంది మోసపోతున్నారు. గతేడాది కంటే ఈసారి 91 శాతం ఎక్కువగా డబ్బులు పోగొట్టుకున్నారు. కరెంట్ ఖాతాల నుంచే సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ఎలాంటి విచారణ లేకుండానే కొందరికి బ్యాంక్ సిబ్బంది కరెంట్ ఖాతాలు ఇస్తున్నారు. అంతేకాదు కొందరు బ్యాంకు సిబ్బంది సైబర్ నేరగాళ్లుకు కూడా సహకరిస్తున్నారని'' సీవీ ఆనంద్ చెప్పారు.