తండ్రి తీసుకున్న డబ్బులకు కూతురు బలైన ఘటన తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో సంచలనం సృష్టించింది. తన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ వద్ద సంగీత్ రావు రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఎప్పటికీ జాబ్ ఇప్పించకపోవడంతో అతడితో పాటు ఆమె కూతురిని డబ్బుల కోసం వేధించారు. ఆపై సంగీత్ రావుతో పాటు అతడి కూతురు, పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు ఆమెను స్టేషన్‌కి పిలిచి డబ్బుల కోసం వేధించారు. దీంతో మనస్థాపం చెందిన దీప్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. సంగీతరావు, కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అనిత భర్త అనిల్ (కానిస్టేబుల్), సైదులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. Also Read : ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు! జరిగిందిందే..? హైదరాబాద్ నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఆమె తండ్రి సంగీత్ రావు ఐఐసీటీలో చాలా ఏళ్లు వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. అయితే సంగీత్ రావుకు బెల్ల అనిల్ అనే కానిస్టేబుల్‌తో కాస్త పరిచయం ఉంది. ఈ క్రమంలోనే అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు అన్నాడు. ఉద్యోగం పేరుతో రూ.15 లక్షలు దీంతో రెండేళ్ల క్రితం కానిస్టేబుల్ అనిల్ నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని సంగీత్ రావు కూతురు దీప్తిని తరచూ అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని.. ఆయన తమతో చాలా ఏళ్లనుంచి కలిసి ఉండటం లేదని దీప్తి చెప్పుకొచ్చింది. అనిల్ అదంతా పట్టించుకోకుండా తన భార్య అనితతో నాచారం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... దీంతో దీప్తి, సంగీత్ రావు మీద ఛీటింగ్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే అనిల్‌కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్ రావు ఆరోపణలు చేశారు. మరోవైపు కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలివ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ చేసినట్లు సమాచారం. మనస్తాపానికి గురై ఆత్మహత్య ఇక ఆమె ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిచి అనిల్ బెదిరించినట్లు దీప్తి వీడియోలో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై దీప్తి రీసెంట్‌గా తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మొబైలో వీడియో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Also Read : ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!