HMDA: హైదరాబాద్‌లో మరో మూడు స్కైవాక్‌లు.. ఎక్కడంటే ?

హైదరాబాద్‌లో మరో మూడు కొత్త స్కైవాక్‌లు రానున్నాయి. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్‌ కూడళ్ల వద్ద వీటిని నిర్మించనున్నారు.ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు.

New Update
SKY WALK

హైదరాబాద్‌లో రోజురోజుకు అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మరో మూడు కొత్త స్కైవాక్‌లు నిర్మించనుంది. ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్‌ కూడళ్ల వద్ద కొత్తగా స్కై వాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుమతులు వచ్చాక వీటి నిర్మాణం జరగనుంది. 

Also Read: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

అయితే హెచ్‌-సిటీలో భాగంగా ఇప్పటికే ఉప్పల్‌ కూడలిలో స్కైవాక్‌ అందుబాటులోకి వచ్చింది. మొత్తం రూ.25 కోట్ల వ్యయంతో రామంతాపూర్ రోడ్డు, నాగోల్, వరంగల్ రోడ్డు, మెట్టుగూడ మార్గాలతో పాటు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు లింక్ చేస్తూ ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీనికి అన్నివైపులా మెట్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఇక రహేజా మైండ్‌స్పేస్‌ ప్రాంగణంలో కూడా ఇలాంటి నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నగరంలో మరిన్ని స్కైవాక్‌లు అవసరమని జీహెచ్‌ఎంసీ ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.   

Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

Skywalks In Hyderabad

ఇదిలాఉండగా.. మున్సిపల్ శాఖ హెచ్‌సిటీ ప్రాజెక్టు కింద రూ.5,942 కోట్ల అంచనా వ్యయంతో 23 పనులు చేపట్టాలని HMDAకు పర్మిషన్ ఇచ్చింది. మొదటగా 2 కూడళ్ల వద్ద.. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కూడలిలో రూ.459 కోట్లతో రెండు ఫ్లైఓవర్లు, రెండు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. అలాగే రూ.158 కోట్లతో విప్రో చౌరస్తాలో ఓ ఫ్లైఓవర్, ఐసీఐసీఐ చౌరస్తాలో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ ఇచ్చింది.     

Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఫోర్త్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఫోర్త్‌ సిటీ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రణాళికబద్ధమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల హబ్‌లను అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఇప్పటికే చర్చించారు. ఫార్మా రంగంతో పాటు, ఏఐసీటీ ఇతర టెక్నాలజీ సిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.    

Also Read: ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు