/rtv/media/media_files/2025/03/08/7N4833WvRzZX1NHtOe4L.jpg)
Jagityal Groom Suicide
సాధారణంగా పెళ్లి (Marriage) అనగానే కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ఊరు ఊరంతా సందడి వాతారణం ఏర్పడుతుంది. ఇక ఆ పెళ్లి ఇంట్లో చిన్నా పెద్ద ఉరుకులు, పరుగులతో.. ఆటలు పాటలతో ఉత్సాహంగా ఉంటారు. పెళ్లికి టైం అయింది.. పనులు త్వరగా కానియ్యండి.. కానియ్యండి అంటూ బిజీ బిజీగా ఉంటారు.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
అంతటి సరదా సందర్భంలో ఊహించని విషాదం జరిగితే.. పెళ్లి వాతావరణం అంతా శోకసంద్రంగా మారుతుంది. పెళ్లికి వచ్చినవారంతా అయ్యో.. పాపం అంటూ కన్నీరుమున్నీరవుతారు. తాజాగా అలాంటిదే జరిగింది. తెల్లారితే పెళ్లి.. అన్ని పనులను చకచకా చేసేస్తున్నారు బంధువులు, స్నేహితులు. ఈ సమయంలో పెళ్లి కొడుకు ఆత్మహత్య (Groom Suicide) చేసుకుని కన్నవారికి విషాదాన్ని మిగాల్చాడు.
పెళ్లికి ముందు రోజే
ఒక్కరాత్రి గడిస్తే మంగళవాయిద్యాల మధ్య రేపు నూతన వధూవరులు ఒక్కటి కానున్నారు. అంతలోనే పెళ్లి కొడుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం రామచంద్రంపేటకు చెందిన కిరణ్ కుమార్ తెల్లవారితే పెళ్లి కొడుకు కానున్నాడు. తెల్లవారితే నవ వధువుతో ఒక్కటై ఏడడుగులు వేయనున్నాడు.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
అంతలోనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడు.. శవమై పాడి ఎక్కాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. అయ్యో కొడుకా.. ఎంత పని చేశావురా? అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందో అన్న విషయం ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.