Padma Awards 2025: గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక మావోయిస్టుకు పద్మపురస్కారం ఎలా ఇస్తారంటూ బీజేపీ మంత్రులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.

New Update
 BJP Vishnu Vardhan Reddy

BJP Vishnu Vardhan Reddy

ప్రముఖ ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌ (Gaddar) కు పద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కేంద్రం మాత్రం పద్మ పురస్కారం ఇవ్వకుండా తిరస్కరించింది. దీనిపై అయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ విషయమై   బీజేపీ మంత్రులు, నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గద్దర్‌ పై తీవ్రంగా మండిపడ్డారు. నక్సలైట్లతో కలిసి గద్దర్‌ అనేకమంది బీజేపీ కార్యకర్తలను హత్య చేయించాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పద్మ ఇవ్వాలని లేఖ రాయడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకివ్వాలి అంటూ వ్యాఖ్యానించారు.

Also Read :  OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!

Gaddar - Padma Awards 2025

ఇప్పుడు ఇదే విషయమై ఏపీ బీజేపీ (BJP) ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి గద్దర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ సమానమన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు. అనేక మంది పోలీసులను చంపిన కేసుల్లో కోర్టులకు తిరగలేనని రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాసుకున్నారు.  గద్దర్ మావోయిస్టు లీడర్.. గద్దర్ కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి.. అంతేకాదు రాజీవ్‌గాంధీని చంపిన ఎల్‌టీటీఈ వారికి రేవంత్ పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అంటూ నిలదీశారు.. అంతేకాదు గద్దర్ కు ఎల్‌టీటీఈకి పెద్ద తేడా లేదన్న ఆయన మాజీ మావోయిస్టు ,రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదా లో రేవంత్ రెడ్డి పద్మ అవార్డు అడుగుతున్నారు.. ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నించారు.. గద్దర్ ను మావోయిస్టు అని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.. గద్దర్ ను చంపడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ..అన్నారు.

Also Read :  యూరిక్‌ యాసిడ్‌ కి అదిరిపోయే ఔషధం ఈ అరటి పండు!

తెలంగాణ ముఖ్యమంత్రి పద్మ అవార్డు (Padma Awards) ల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విష్ణువర్థన్‌ రెడ్డి విమర్శించారు.. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వాళ్లు రేవంత్ కి సలహాలు ఇస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు.. పబ్లిక్ డొమైన్ లో ఓటింగ్ ద్వారా కూడా పద్మ పురస్కారాలు ఇస్తారు.. దరఖాస్తులు చేయని మొగలయ్యకు పద్మ శ్రీ ఇచ్చారు.. భారత ప్రభుత్వం గుర్తించి వనజీవి రామయ్యకు పద్మ అవార్డు ఇచ్చిందన్నారు విష్ణువర్ధన్‌ రెడ్డి. కాగా గద్దర్‌ విషయంలో బీజేపీ వైఖరి ఇలా ఉంటే మరి కాంగ్రెస్‌ మాత్రం గద్దర్‌కు పద్మ ఇవ్వాల్సిందేనంటోంది.

Also Read :  డీప్‌సీక్‌ పనితీరు బాగుందన్న ఓపెన్‌ ఏఐ సీఈవో

Also Read :  సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు