Fire Breaks: మాదాపూర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని మదాపూర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది.

New Update
Fire accident bapatla

Fire Accident In Madhapur

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిన్న (శనివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఇది మరుకముందే మాదాపూర్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి.

దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంది. అనంతరం మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. దాదాపు మూడు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

సాఫ్ట్‌వేర్‌లో మంటలు

నిన్న (శనివారం) హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఐదంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

ఒక్కసారిగా మంటలు:

వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రంగలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని.. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మందస మండలం హరిపురం సమీపంలోని ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జీడి పరిశ్రమలో మంటలు చెలరేగాయి. 

ఇది కూడా చూడండి: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

వెంటనే  అగ్రిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యట్‌ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్‌ సిబ్బంది వెల్లడించారు.

రూ.2.50 కోట్ల ఆస్తి నష్టం:

ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్థమైంది. రెండున్నర కోట్లు ఆస్తి నష్టం జరగటంతో యజమని  కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. జీడిపప్పు గోదాంలో వంటలు చెడరేగడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యారు. కోట్ల విలువ చేసే జీడిపప్పు దగ్ధం అవ్వడంపై యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా?

భారీ అగ్ని ప్రమాదం వలన ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో అలముకున్నది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లు విలువైన జీడిపప్పు అగ్నికి దగ్ధమవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని యాజమన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రమాదంలొ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు