/rtv/media/media_files/2026/03/14/electric-kits-for-autos-in-telangana-2026-03-14-07-52-47.jpg)
electric kits for autos in telangana
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం(telangana-government) కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోరిక్షా(auto) లకు ఎలక్ట్రిక్ కిట్లు(Electric Kits) ఇవ్వనుంది. హరిత ఇంధన వినియోగాన్ని పెంచి నెట్ జీరో కర్బన ఉద్గారాల దిశగా ముందుకెళ్లనుంది. ఈ పరిధిలో ఉన్న 1.26 లక్షల ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడిపిస్తున్న ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు అందించేందుకు రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ స్పెషల్ పాలసీని రూపొందించనున్నారు.
Also Read: గ్యాస్ కొరత.. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్
Electric Kits For Autos
ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్ పాలసీ ఖరారు చేసేందుకు మార్చి 16న సెక్రటేరియట్‌లో ఉన్నతస్థాయి మీటింగ్‌ను ఏర్పాటుచేయనున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లను అమర్చేందుకు ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. 2026-27 బడ్జెట్‌లో దీనికోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆదేశించారు.
Also Read: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్.. సుప్రీం కోర్టు సంచలన ప్రకటన
ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా సంక్షేమ శాఖల సబ్ ప్లాన్‌ల నుంచి నిధులను సబ్సిడీ ద్వారా ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు పెట్టేందుకు దాదాపు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఖర్చవుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ORR పరిధిలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులే నడిపిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
Follow Us