TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఆయా స్థానాలకు ఎన్నిక జరగనుంది. అదే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

New Update
ELECTION Commission

తెలంగాణ (Telangana), ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 3న ఈసీ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 

ఇది కూడా చదవండి: అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి త్రిష సంచలనం

ఏపీలో..

ఏపీ (AP) లో తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణ-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ ఉంటుంది. 

ఇది కూడా చదవండి: KTR Vs Komatireddy: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!

తెలంగాణలో..

తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ఉంటుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే కోడ్ అమ్మలోకి రానుంది. దీంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉండదు. పథకాలకు సంబంధించిన నిధులను సైతం విడుదల చేయడానికి ఆంక్షలు ఉంటాయి. తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలు తదితర ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు