అల్లు అర్జున్‌పై తెలంగాణ డీజీపీ జితేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన విషయంలో బన్నిపై డీజీపీ పరోక్షంగా స్పందించారు. పౌరులు అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్ ఎవరికీ మేం వ్యతిరేకం కాదు.. వ్యక్తిగతంగా ఎవరికీ కూడా మేం వ్యతిరేకం కాదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదుష్టకరమని, పౌరుల రక్షణే మా ప్రాధాన్యమన్నారు. సినిమాల్లో హీరోలు అయిన బయట సాధారణ పౌరులే. పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి పుష్ప-2 సినిమా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులంతా కూడా అతన్ని పరామర్శించడానికి వెళ్లారు. చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్‌ను చూడటానికి వెళ్లకుండా బన్నీని పరామర్శించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్