సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

సైబర్ నేరాలను నివారించేందుకు సైబరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. PROTECT (ప్రొటెక్ట్) అనే పేరుతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు మంగళవారం ప్రారంభించారు.

New Update
CYBER CRIME


రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల చాలామంది వేలు, లక్షలు, కోట్లాది రూపాయలు కూడా పొగొట్టుకుంటున్నారు. అయితే సైబర్ నేరాలను నివారించేందుకు సైబరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. PROTECT (ప్రొటెక్ట్) అనే పేరుతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు మంగళవారం ప్రారంభించారు. 

Also Read: జమిలి ఎన్నికల బిల్లు.. విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా

ఆన్‌లైన్‌లో నెటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పనిచేయనుంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడారు. '' రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నేరం జరిగాక నేరస్థులను పట్టుకోవడం కన్నా అసలు ఇలాంటి సైబర్ నేరాలే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత అందిరిపై ఉంది. 

Also Read: హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌‌కు మెసేజ్‌ పెట్టి యువతి ఆత్మహత్య

సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది బాధితులు దాదాపు రూ.700 కోట్లు పోగొట్టుకున్నారు. మనకు తెలియకుండానే మన బ్యాంకులో డబ్బులు పోతున్నాయి. 1930కి కాల్ చేస్తే సైబర్‌ నేరగాళ్ల నుంచి పోలీసులు కాపాడతారు. సోషల్ మీడియా ద్వారా కూడా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మేము చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్‌తో మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటున్నామని'' సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏ లింక్ పడితే దాన్ని నొక్కేయడం, ఫోన్‌లో గుర్తు తెలియని వాళ్లకు కూడా అన్నీ వివరాలు చెప్పడం లాంటి పనుల వల్ల ఈ నేరాలు పెరుగుతున్నాయి. మరోవైపు డిజిటల్ అరెస్టులు కేసులు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరికి పడితే వాళ్లకి బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు. 

Also Read: కంపెనీలో సిబ్బందికి పనిష్మెంట్‌.. 30 నిమిషాలు నిల్చోవాలంటూ సీఈవో ఆదేశ

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు