సీఎం రేవంత్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లనున్నారు. అక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 11,12,13 తేదీల్లో జైపూర్‌లో జరిగే బంధువుల పెళ్లి వేడుకకు సీఎం కుటుంబం హాజరుకానుంది. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత రేవంత్ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. Also Read: హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారీ కీలక ఆదేశాలు Revanth Reddy Delhi Tour ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో రేవంత్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్.. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ శాఖల కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. Also Read: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం..! మరోవైపు రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గం విస్తరణపై కూడా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ జరగలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించకపోవడంతో ఈ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమైంది. ఇక వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందా ? లేదా ముందే ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ALso Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు Also Read: ఆపరేషన్ హైడ్రా సక్సెసైందా..? ఇప్పుడు ఏం చేస్తోంది..?