Oppo Find X9 Series: 200MP సహా నాలుగు కెమెరాలు, 7,500mAh బ్యాటరీతో కిర్రాక్ మొబైల్స్..!

Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.

New Update
Oppo Find X9 Series

Oppo Find X9 Series

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్‌ను లాంచ్ చేసింది(new-smartphone). ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. Find X9 Pro ఫోన్ 7,500mAh బ్యాటరీని కలిగి ఉండగా.. Find X9 ఫోన్ 7,025mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు Oppo Find X9, Oppo Find X9  Pro ల గురించి తెలుసుకుందాం. 

Oppo Find X9 Price

Oppo Find X9 ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999 కాగా.. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. ఇది బ్లాక్, టైటానియం గ్రే కలర్‌లలో లభిస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్ నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి. 

Also Read :  ఉద్యోగులపై కాగ్నిజెంట్ స్పై.. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే.. జాబ్ పోయినట్లే?

Oppo Find X9 Specs

Oppo Find X9 మొబైల్ 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2760×1256 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 460 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది కూడా MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఒప్పో ఫైండ్ X9.. 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,025mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 

కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఫైండ్ X9 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. - mobile-offers

Oppo Find X9 Pro Price

Oppo Find X9 Pro మొబైల్ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.109,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది సిల్క్ వైట్, టైటానియం చార్‌కోల్ కలర్‌లలో లభిస్తుంది. 

Also Read :  చౌకైన 110cc స్కూటీలు.. 50కి.మీ మైలేజ్- ధర తక్కువ ఫీచర్లెక్కువ..!

Oppo Find X9 Pro Specs

Oppo Find X9 Pro మొబైల్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2772×1272 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంది. MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. Oppo Find X9 Pro 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Oppo Find X9 Proలో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Oppo Find X9 సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 16 ఆధారంగా ColorOS 16.0పై నడుస్తాయి. 

Advertisment
తాజా కథనాలు