Telangana Rains: మరో మూడు రోజులు జోరు వానలు..ఐఎండీ వార్నింగ్!
ఐఎండీ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, తెలంగాణలో వచ్చే 2-3 రోజులు వానలు కొనసాగవచ్చని అంచనా వేసింది.
ఐఎండీ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, తెలంగాణలో వచ్చే 2-3 రోజులు వానలు కొనసాగవచ్చని అంచనా వేసింది.
ఈరోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలకు తోడు ద్రోణి ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. దీన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి.
ఏపీకి మరోసారి భారీ వర్షసూచన జారీ అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి. రానున్న ఐదారు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ కేంద్రం తెలిపింది.