Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే..భారత ప్రధాని చెసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలియడంతో అతడిని వెళ్లిపోవాలని ఆదేశించింది.
భారత్ వైమానికి దాడులలో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. దీంతో ఎంఐఎం అధినేత పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను ఎక్స్ లో ప్రశ్నించారు. చైనా నుంచి తెచ్చకున్న అద్దె విమానాలను రహీమ్ యార్ ఖాన్ రన్ వేపై ల్యాండ్ చేయగలరా అని ట్వీచ్ చేశారు.
షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.
భారత్ ఆర్మీ ఎటాక్ చేసిన సర్గోదా ఎయిర్ బేస్ సమీపంలో కిరానాహిల్స్ ఉన్నాయి. ఈ కిరానాహిల్స్‌లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచి ఉంచిందని తెలుస్తోంది. భారత్ దాడి నేపథ్యంలో అణు వాయువులు లీక్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
భారత్, పాక్ దేశాల మధ్య కాల్పులు విరమణ తరువాత మళ్లీ అసిమ్ మునీర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను కలుస్తున్నారు. ఎల్ఓసి వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.
పాకిస్తాన్ కిరానా హిల్స్‌లో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై బ్రహ్మోస్ వంటి క్షిపణులతో దాడులు చేసినా అణు బాంబు విస్ఫోటనం చెందదు. దీని చూట్టూ ఉన్న ప్రాంతానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. బలమైన కాంక్రీట్ మధ్యలో నిల్వ చేయడం వల్ల విస్ఫోటనం చెందవట.