Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపుతోంది.
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపుతోంది.
నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను.
హను-మాన్ మూవీ థియేటర్స్‌లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదే టైంలో డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ని ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. .థియేటర్స్‌లో హనుమాన్ అధరగొడుతుంటే.. ఓటిటి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు.
నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, వయాకామ్ 18 వంటి బ్రాడ్కాస్టర్లు సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ బ్రాడ్కాస్టర్లందరూ పెరుగుతున్న కంటెంట్ ఖర్చులను భర్తీ చేయడానికి టీవీ ఛానెల్‌ల ధరలను పెంచారు. సోనీ కూడా ధరలు పెంచింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది.ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది.యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
అందరూ తీసుకుంటుంటే మేమేం తక్కువ తిన్నాం అంటున్నారు అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు. ఓటీటీలో తమకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లలానే అమెజాన్ లోనే యాడ్స్ మొదలెడతామని చెబుతున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'దేవర' నుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ నిర్మాత కల్యాణ్ రామ్. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపారు. మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైందని, త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామన్నారు.
‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి నాలుగో వారంలో స్ట్రీమింగ్ కానుందని డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశారు. మూవీ రన్‌టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం మళ్లీ యాడ్ చేస్తున్నామన్నారు.