BREAKING: మమతా బెనర్జీపై సువేందు పోటీ.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది.
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు రూ.33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. యువ సాథి అనే స్కీమ్ కింద రాష్ట్రంలో 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 7 నుంచే నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 63.66 లక్షల ఓటర్లను తొలగించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర సర్కార్కు స్పష్టం చేసింది.
టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే టీఎంసీ సర్కార్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే 45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే దేశ ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్నారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూసుకుందాం అంటూ సవాలు విసిరారు.