/rtv/media/media_files/2026/03/16/bjp-releases-1st-candidates-list-in-west-bengal-and-kerala-2026-03-16-19-06-42.jpg)
BJP releases 1st candidates list in West bengal and kerala
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది. నందిగ్రామ్ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయనున్నారు. భవానీపుర్ నియోజవర్గంలో 2011 నుంచి టీఎంసీ గెలుస్తూ వస్తోంది. ఈసారి మమతా స్థానం నుంచే సువేందు అధికారిని బరిలోకి దింపడంపై ఆసక్తి నెలకొంది.
Also Read: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట.. కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు ప్రారంభం
ఇదిలాఉండగా కేరళలో కూడా బీజేపీ 47 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేమమ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక మరో కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్ పేరు కూడా మొదటి జాబితాలోనే ప్రకటించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఓడిపోయిన నవ్య హరిదాస్‌ను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Also read: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం
కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న 152 స్థానాలకు, అలాగే ఏప్రిల్ 29న 142 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడు, ఏప్రిల్ 9న అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 4 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Follow Us