TMC డర్టీ పాలిటిక్స్.. మోదీ ఫుల్ ఫైర్!

తృణమూల్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు రూ.33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

New Update
modi

తృణమూల్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు రూ.33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.  అనంతరం సభలో మాట్లాడిన మోదీ.. దీదీ సర్కార్ పై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. 

TMC రాష్ట్రపతిని అవమానించిందని ప్రధాని ఆరోపించారు. "ఎంత శక్తివంతుడైనా అహంకారంతోనే నాశనమవుతాడని మన దేశంలో చెబుతారు. ఒక గిరిజన మహిళను, దేశ ప్రథమ పౌరురాలిని అవమానించిన టీఎంసీ అహంకారాన్ని బెంగాల్ ప్రజలు త్వరలోనే అణచివేస్తారు" అని మోదీ హెచ్చరించారు.  ఒక గిరిజన మహిళను, దేశ అధ్యక్షురాలిని అవమానించినందుకు టీఎంసీని ఎప్పటికీ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. 

సంతాల్ కమ్యూనిటీకి చెందిన ఒక పెద్ద వేడుక కోసం రాష్ట్రపతి బెంగాల్ వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడమే కాకుండా, కనీస ఏర్పాట్లు చేయకుండా గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, భారత రాజ్యాంగానికి జరిగిన అవమానమని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలన యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే చిన్న వేదికను కేటాయించిందని, చివరి నిమిషంలో వేదికను మార్చి రాష్ట్రపతిని ఇబ్బంది పెట్టిందని విమర్శించారు.

ప్రధాని ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ అంతే వేగంగా తిప్పికొట్టింది. రాష్ట్రపతి పదవిని బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ఆరోపించారు. రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన పదవిని దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రధాని మోదీ, బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని, రాష్ట్రపతి పదవిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని టీఎంసీ పేర్కొంది.

ఇంతకు ఏం జరిగిందంటే..  

మార్చి 7న డార్జిలింగ్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్‌లో ఏర్పాట్ల పట్ల రాష్ట్రపతి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. వేదిక మార్పు, సౌకర్యాల లోపంపై ఆమె విమర్శలు చేయడంతో ఈ అంశం కాస్తా బీజేపీ-టీఎంసీ మధ్య పెద్ద రాజకీయ పోరాటంగా మారింది. వచ్చే ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో ఈ రాష్ట్రపతి అవమానం అంశం ఎంతటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు