Marriage : సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి.. ఇద్దరు మహిళల వివాహం
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు.
కులం, మతం, ఆస్తి కోణంలో జరిగిన పరువు హత్యలను చూశాం. కానీ బాపట్ల జిల్లాలో జరిగిన హత్యకు విచిత్ర కారణం కావడం సంచలనం రేపింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది.
సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీకి పనిచేస్తున్న 28 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురుగ్రామ్ లో జరిగింది. శుభమ్ మీనాకు ఆరు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక మహిళతో ప్రేమ వివాహం జరిగింది.
ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ యువకుడు హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బిహార్లోని మధుబని జిల్లాలో 70 ఏళ్ల ఠకై యాదవ్, 65 ఏళ్ల జగీయా దేవికి వివాహమైన వార్త వైరల్ అవుతోంది. ఈ వృద్ధ దంపతులు 7ఏళ్లుగా అక్రమసంబంధం కలిగి ఉన్నారు. ఒకరోజు తోటలో అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించడంతో గ్రామస్తులు వారికి పెళ్లి చేశారు.