YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్
ఏపీ మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయనకు గతంలో మంజూరు చేసిన మినహాయింపును రద్దు చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయనకు గతంలో మంజూరు చేసిన మినహాయింపును రద్దు చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ 21లోపు వ్యక్తిగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో కోర్టులో ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది.
ఓబుళా పురం గనుల్లో జరిగిన అక్రమాలపై ఏడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కర్ణాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన శాసనసభ్యత్వం రద్దయింది.
17 ఏళ్ల నాటి అవినీతి కేసులో పంజాబ్, హర్యానాహైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 2008లో జరిగిన క్యాష్-ఎట్-జడ్జి డోర్ కేసులో ఆమెతో పాటుగా మరో ముగ్గురు నిందితులను చండీగఢ్‌లోని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 2025 జనవరి 11వ తేదీ నుంచి 25 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. కుటుంబ సమేతంగా యూకే వెళ్లాలని పిటిషన్ లో అనుమతి కోరారు జగన్.
ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది.