విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 2025 జనవరి 11వ తేదీ నుంచి 25 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. కుటుంబ సమేతంగా యూకే వెళ్లాలని పిటిషన్ లో అనుమతి కోరారు జగన్ దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జగన్ పిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. సీబీఐ అధికారులు కౌంటర్ ధాఖలు చేసిన అనంతరం వాదనలు జరగనున్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడు దేశం విడిచిపెట్టి వెళ్లాలి అనుకుంటే తప్పకుండా సీబీఐ కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు కోర్టు తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతులు పెట్టింది. దీంతో జగన్ న్యాయస్థానం అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అనుమతి వచ్చిన తర్వాతే గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. అనుమతి వచ్చిన తర్వాతే వెళ్లారు. గతేడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. మే17 నుంచి జూన్1 వరకు ఆయన విదేశాల్లో పర్యటించారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలను ఆయన సందర్శించారు. ఇప్పుడు ఆయన మరోసారి యూకే పర్యటనకు వెళ్తున్నారు జగన్. Also Read : ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు..అంతా బాబాయి చలవే!