మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి.
మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే ఛాన్స్ ఉంది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎంగా పఢ్నవీస్ పేరు ఖరారైందని ఓ బీజేపీ నేత వెల్లడించారు.
ప్రజల హక్కులు నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం తన స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్ ప్రజల కోసం తన గొంతుని వినిపిస్తానన్నారు.
రైతు రుమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు.
డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది.
TG: సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు రేవంత్‌పై వేసిన పిటిషన్ ను వచ్చే నెల 11న విచారిస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు.