Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలీడే ఇస్తూ సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కొమరోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంపుగా ఏర్పడి పోలీస్ ఠాణాకు వచ్చే ప్రజలకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన 6గురు విద్యార్థులు కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆచూకీ లభ్యమైంది. వారిని ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఆలమూరు తీసుకుని వస్తున్నారు.
ఏపీలో రేషన్‌కార్డుదారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈకేవైసీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గడువును మరో నెలవరకు పొడిగించింది. ఈ గడువు ఈ నెల 31 నాటికి ముగిసింది. ఈకేవైసీ చేయించుకునే గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన జరిగింది. 24వ తేదీ నుంచి వీరంతా కనిపించకుండా పోయారు.
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.