Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 139 పరుగులు చేస్తే.. !

విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. కోహ్లీ ఇప్పటివరకు 300 వన్డే మ్యాచ్‌ల్లో 14 వేల 96 పరుగులు చేశాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో మరో 139 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బద్దలు కొడతాడు.

New Update
dgdg

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగబోయే సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 300 వన్డే మ్యాచ్‌ల్లో 14 వేల 96 పరుగులు చేశాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో మరో 139 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బద్దలు కొడతాడు. తన15 ఏళ్ల వన్డే కెరీర్‌లో సంగక్కర శ్రీలంక తరపున 404 మ్యాచ్‌లు ఆడి 14 వేల 234 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ మరో 139 పరుగులు చేస్తే  అంతర్జాతీయ వన్డేలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్ గా నిలువనున్నాడు.  వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (18426) పరుగులతో టాప్ లో ఉన్నాడు. 

Also Read :  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు 

1. సచిన్ టెండూల్కర్ (భారత్ ) - 18,426 పరుగులు

2. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 14,234 పరుగులు

3. విరాట్ కోహ్లీ (భారత్) - 14,096 పరుగులు

4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 13,704 పరుగులు

5. సనత్ జయసూర్య (శ్రీలంక) - 13,430 పరుగులు

Also Read :  కడసారి చూపు కూడా వీడియో కాల్‌ లోనే...భగవంతుడా ఇంతటీ దయనీయ పరిస్థితి ఎవరికి వద్దయ్యా!

Also Read :  ట్రంప్‌ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్‌ బఫెట్‌!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు  

1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 34357 పరుగులు

2. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 28016 పరుగులు

3. విరాట్ కోహ్లీ (భారత్) - 27514 పరుగులు

4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 27483 పరుగులు

5. మహేల జయవర్ధనే (శ్రీలంక) - 25957 పరుగులు

6. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 25534 పరుగులు

7. రాహుల్ ద్రవిడ్ (భారత్) - 24208 పరుగులు

Also read :  Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు