champions trophy: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు

ఛాంపియన్స్ ట్రోఫీలో విరాక్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. 111 బంతుల్లో సెంచరీ(100*) చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సచిన్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు.

New Update
virat kohli

virat kohli Photograph: (virat kohli)

ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా విరాక్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. 111 బంతుల్లో సెంచరీ(100*) చేసి టీమిండియాను గెలిపించాడు. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 241 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సచిన్ టెండుల్కర్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు విరాట్. విరాట్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 

Also Read : ఇండియాకు చేరుకున్న 12 మంది అమెరికా అక్రమవలసదారులు

సచిన్ టెండుల్కర్‌ 350 ఇన్నింగ్స్‌లో 14 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లి 287 ఇన్నింగ్స్‌లోనే 14 వేల పరుగులు దాటాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కన్నా ఎక్కువ పరుగులు చేశారు. తాజాగా కోహ్లి మూడో స్థానంలోకి చేరుకున్నాడు. ఇందులో సచిన్‌ టెండుల్కర్ (భారత్‌) 18,426 పరుగులు, కుమార సంగక్కర (శ్రీలంక) 14,234 పరుగులు, విరాట్‌ కోహ్లి (భారత్‌) 14,002 పరుగులు చేసినవాళ్లుగా ఉన్నారు.  

Also Read: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం

287వ ఇన్నింగ్స్‌లో(ఈ మ్యాచ్ తో కలిపి) విరాట్ కోహ్లీ 51 సెంచరీలు, 75 ఆఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులో విరాట్ చెలరేగాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు