Rohit sharma : రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు నెట్టింట మారుమోగిపోతుంది.  ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

New Update
rohit  (1)

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నీని కైవసం చేసుకుంది.  ఫైనల్ మ్యాచ్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.  దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు నెట్టింట మారుమోగిపోతుంది.  ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

వార్షిక జీతం రూ.7 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో కెప్టెన్ రోహిత్ శర్మ A+ గ్రేడ్ ఆటగాడు.  ఈ ఒప్పందం ప్రకారం రోహిత్ వార్షిక జీతం రూ.7 కోట్లు పొందుతాడు. మ్యాచ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3 లక్షల ఆదాయాన్ని పొందుతాడు.  ఇదేకాకుండా ఐపీఎల్ నుండి రూ. 16 కోట్ల ఆదాయాన్ని పొందుతాడు.  అతని నికర విలువ ఆస్తి దాదాపుగా రూ.214 కోట్లు ఉంటుందని అంచనా. 

కేవలం క్రికెట్ ద్వారా మాత్రమే అతని సంపాదనను పరిగణనలోకి తీసుకుంటే సంవత్సరానికి దాదాపు రూ. 23 కోట్లు సంపాదిస్తాడు. అంటే రోహిత్ నెలవారీ ఆదాయం దాదాపు రూ. 2 కోట్లు అన్నమాట. ఇదేకాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా ఆదాయం కూడా కలుపుకుంటే, అది రెండు కోట్లకు పైగానే ఉంటుంది.  

రోహిత్  వివిధ పెద్ద కంపెనీల ప్రకటనల ద్వారా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. రోహిత్ శర్మ అనేక అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. CEAT, రస్నాతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల జాబితాలో ఓరల్-బి, స్విగ్గీ, ఇక్సిగో, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, న్యూ ఎరా, అరిస్టోక్రాట్, IIFL వంటి కంపెనీలు ఉన్నాయి.  

పెట్టుబడి విషయంలో కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్నాడు. అనేక స్టార్టప్‌లలో దాదాపు రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టాడు.  దీనితో పాటు ముంబైలో క్రిక్ కింగ్డమ్ అనే క్రికెట్ అకాడమీని కూడా నడుపుతున్నాడు. ముంబైలో రోహిత్ శర్మ ఇంటి ధర దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుంది.  రోహిత్ వద్ద  రేంజ్ రోవర్ HSE LWB వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.  

Also Read :   టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు