BGT 2024-25: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత జట్టు ముంబయి ఆఫ్‌స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌కు ఎంచుకుంది. రీసెంట్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో సెలక్టర్లు ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎంపిక చేశారు.

New Update
Tanush Kotian to join India Test squad

Tanush Kotian to join India Test squad

టీమిండియా స్టార్ ఆటగాడు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రీసెంట్‌గా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలో సెలక్టర్లు మరో స్పిన్నర్‌ను తీసుకున్నారు.

Also Read: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!

26 ఏళ్ల తనుష్ కోటియన్‌

ముంబయి ఆఫ్‌స్పిన్నర్ 26 ఏళ్ల తనుష్ కోటియన్‌ను ఎంపిక చేశారు. అయితే మొదట అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆస్ట్రేలియాకు పంపాలని ఆలోచించారు. కానీ అతడు పలు కారణాలతో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమవడంతో కోటియన్‌ను సెలక్ట్ చేసినట్లు సమాచారం.

Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

కాగా కోటియన్ భారత్-ఎ సభ్యుడిగా గత నెల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కోటియన్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే త్వరలో మెల్‌బోర్న్‌కు కోటియన్ బయల్దేరనున్నాడు. డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య బాక్సిండ్ డే టెస్టు జరగనుంది. దీంతో ఈ టెస్ట్‌ జరగడానికి ముందే కోటియన్ టీమిండియా జట్టుతో కలవనున్నాడు. 

Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. హైదరాబాద్ - ముంబయి మధ్య మ్యాచ్ జరగగా.. 2 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 33 రన్స్ చేసి అజేయంగా నిలిచి ముంబయిని విజయ పథంలో నడిపించాడు. ఇదిలా ఉంటే కోటియన్ ఇప్పటి వరకు 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 101 వికెట్లు పడగొట్టాడు. అలాగే 1,525 రన్స్ చేశాడు. మరి సీనియర్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో రానున్న కోటియన్ ఎలాంటి ఆటతీరు కనబరుస్తాడో అని క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. . . .  

Also Read: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు