Ind Vs Pak: అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్.. కేవలం 60 బంతులు చాలు: యువరాజ్‌ సింగ్‌

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఆటతీరుపై యువరాజ్ సింగ్ జోష్యం చెప్పాడు. అతడు కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్థాన్‌‌పై సెంచరీ చేయగలడు. అదీ కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని అంచనా వేశాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్ అని కొనియాడాడు.

New Update
Rohit Sharma Will Score 60 Ball Hundred Yuvraj Singh Prediction Ahead Of India vs Pakistan match

Rohit Sharma Will Score 60 Ball Hundred Yuvraj Singh Prediction Ahead Of India vs Pakistan match

Ind Vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఫిబ్రవరి 23న అంటే రేపు భారత్ - పాకిస్థాన్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) దూకుడు ఆటతీరు ప్రదర్శించిన విషయం తెలిసిందే.  అయితే పాకిస్థాన్‌(Pakistan)తో మ్యాచ్‌లో కూడా రోహిత్ అదే ఫామ్‌ కొనసాగించాలని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) సూచించాడు. 

Also Read: Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

60 బంతులు చాలు

రోహిత్ క్రీజ్‌లో కాస్త ఓపికతో ఉంటే చాలు పాకిస్థాన్‌పై ఈజీగా సెంచరీ చేయగలడు. అందులోనూ కేవలం 60 బంతుల్లోనే అతడికి సెంచరీ చేసే సత్తా ఉందంటూ యువీ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌పై ప్రదర్శించిన ఫామ్‌నే నెక్స్ట్ మ్యాచ్‌లో ప్రదర్శిస్తే కేవలం 60 బంతుల్లోనే సెంచరీ సాధిస్తాడు అని పేర్కొన్నాడు. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

ఒంటిచేత్తో గెలిపిస్తాడు

రోహిత్ ఆటతీరు అలా ఉంటుందని.. ఒక్కసారి అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబట్టేస్తాడని తెలిపాడు. అతడు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో దిట్ట అని అన్నాడు. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో వచ్చే బాల్‌ని సైతం అతడు అలవోకగా ఆడేస్తాడని పేర్కొన్నాడు. రోహిత్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్ అంటూ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.  

Also Read: Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

ఇక రోహిత్, కోహ్లీ చాలా సీనియర్ ప్లేయర్లు. వారికి ఫామ్‌తో సంబంధం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా వన్డేల్లో వారిద్దరూ ఎప్పుడూ మ్యాచ్ విన్నర్లే అంటూ పేర్కొన్నాడు. ఇక రోహిత్ కాస్త ఇబ్బంది పడుతూనే రన్స్ రాబడుతున్నాడు. అతడు గానీ కుదురుకుంటే ప్రత్యర్థికి మరింత ప్రమాదమే అని యువీ చెప్పుకొచ్చాడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు