/rtv/media/media_files/2025/03/01/4vLmPDkjYuYmZEnYn6o8.jpg)
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక కామెంట్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ కు వెళ్తాయని.. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. వాస్తవానికి తాను ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాను కానీ సమీకరణాలు చూస్తుంటే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందని తాను భావిస్తున్నానని తెలిపాడు.
శుక్రవారం కలకత్తా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న క్లార్క్ ఈ విధంగా స్పందించాడు. దుబాయ్ లో పిచ్ స్పినర్లకు అనుకూలంగా ఉంటుందని.. భారత ఆటగాళ్లు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ టీమిండియాకు కీలకంగా మారనుందని మైఖేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలుస్తాడన్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ, నంబర్ 1 వన్డే జట్టు భారత్ అని క్లార్క్ కితాబిచ్చాడు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 100 పరుగులు సాధించినందుకు క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. గొప్ప ఆటగాళ్ళు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా జట్టుకు అత్యంత అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ నిలబడతారని తెలిపాడు.
భారత్ తో సెమీ ఫైనల్ ఎవరంటే!
సెమీఫైనల్ లో టీమిండియాతో ఆడబోయే జట్టు ఏది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు న్యూజిలాండ్ తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఇందులో టీమిండియా గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంటుంది. అప్పుడు గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో టీమిండియా సెమీస్‌తో తలపడాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఇంగ్లాండ్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే అప్పుడు గ్రూప్ బీలో సౌతాఫ్రికా నంబర్ వన్ ప్లేస్‌లోకి చేరుకుంటుంది. అప్పుడు ఇండియా ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఉంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా ఓడిపోతే రన్ రేట్ పరంగా సెమీ ఫైనల్ లోఇండియాకు ప్రత్యర్థిగా మారుతుంది.
Also read : BCCI లేకపోతే ICCకి జీతాల్లేవ్.. వాళ్లను పొట్టు పొట్టు తిట్టిన సునీల్ గావస్కర్!